Tuesday, 17 June 2014

నా మనసు తత్వము

శివమ్
మూడు అక్షరాలలాగానే ఏ పనినైనా మూడుసార్లు ప్రయత్నిచి పలితము లేకుంటే విడిచిపెట్టే చెడ్డ అలవాటు నాకుంది
ఎవరైనా3సార్లు అబద్దమాడినా తరువాత  నిజం చెప్పినా నమ్మకం కుదరడం కష్టం
      నా గురించి కాకుండా పరాయివారు
మంచిగా వుండాలి అని అనుకుంటాను
  ఎవరికి అయినా అప్పుగా డబ్బు సహయం చేస్తె అతడు ఇవ్వక నన్ను సతాయిస్తె అతనికి మంచిమనసు ఆ దేవుడు ఇవ్వాలి, అతనిని చల్లగా చూడాలి అని కోరుకుంటాను.
(కాకపోతే సతాయించినందుకు తిడతాను అంతే) ఎందుకంటే నేను నిజంగా భదపడి తిడితే (చెడు కోరుకుటే )వారికి నిజంగా చెడు జరుగింది జరుగుతుంది.
  ఎవరైనా నన్ను అనుమానిస్తే మాత్రం పట్టలేని ఉక్క్రోషం

Thursday, 5 June 2014

లోకులు కాకులు(మనకు నచ్చిందే చేయాలి)పట్టించుకోవద్దు (ఇది నిజంగా జరిగింది,(103 వయసు నిజం)

ఒక వూరిలో103 సంవత్సరాల అవ్వ ,అయినా ఆమె పద్దరికమే ఆ ఇంట్లో. ఆమె మనుమలు ఆమె మాట జవదాటక పోవడం ఆమె యొక్క ఆలోచనా సరలిని ఒప్పుకోవాలి.ఎందుకంటే ప్రవర్తనగలిగిన మనుమలను తయారు చేసింది. ముక్యంగా చెప్పుకోవాలంటే డబ్బును వృదాచేయకుండా ఎలా వుండాలి,మధ్యతరగతి కాబట్టి ,పరువు పోకుండా న్యాయంగా కష్టపడి డబ్బును సంపాదించారు.
   డబ్బును ఆచితూచి కర్చుచేయడంతో ఆ వూరిలోవారందరూ పిసినారి అనడం మొదలుపెట్టారు.
  మనుమడు పెల్లీడుకు వచ్చినపుడు , అందరూ పిసినారి కట్నం ఎక్కువ అడుగుతాడు అనుకోవడంతో పిల్లనివ్వడానికి ఒక్కరూ ముందుకు రాలేదు.
  అది తెలిసి మాకు కట్నం ముఖ్యంకాదు పిల్ల ముఖ్యం అని బంధువులకు చెప్పుకోగా,తెల్లని అమ్మాయిని అతి తక్కువ కట్నం తో చేషారు.
  లోకులు కాకులుకదా ,వూరుకుంటారా ఎం పోయేకాలం వారి ఆస్తికి గతిలేెని ఇంటినుంచి అమ్మాయిని తెచ్చుకున్నారు అవ్వ....అనుకుంటూ వుండడంతో
ఇంకొక మనవనికీ కట్నం ఎక్కువ తీసుకొని నల్లని అమ్మాయినిచ్చి పెల్లి చేసెను.

Wednesday, 4 June 2014

బక్కోడు

పూర్వము భీముడు అనే యోదుడు ఉండేవాడు , అతని శరీరము పేరుకుదగ్గట్టు వుండేది.ఆ రాజ్యంలో అతనంత భలశాలి లేరు.
   పక్కరాజ్యంలో సుందమరయ్య అనే భల శాలి ఉన్నాడని తెలుసుకొని బయలుదేరాడు.
   పక్కరాజ్యంలో ప్రవేశించాక  అడివితోవన వెలుతూ వుంటే ఒక బక్కపలచనివ్యక్తి చేతితో లావు కలపని విరచి మోపుకట్టుకోవడం గమనించి  అతనికి గొడ్డలికొనే స్తోమతలేక చేత్తొ కలప నరుకుతున్నాడేమో అనుకున్నాడు.
సుందమరయ్య జాడ తెలుసుకునేటందుకు అతనిని అడుగగా అతడు తీసుకెళ్తా అనెను.
మొదట అతను తన ఇంటికి తీసుకెల్లెను,భోజనానికి పిలవగా అప్పటికీ భీమునికి ఆకలి దంచేస్స్తండడంతో కాలుచేతులుప కడుకొని అతనితో కలిపి కూర్చోన్నాడు.
  అతని భార్య అన్నము కూర ఇద్దరికీ వడ్డించెను .ఆ కాలం నెయ్యిలేని వారు నువ్వలనూనే వేసుకోనేవారు.భర్యను నూనె వేయిమనెను ,ఆమె ఇద్దరి చేతులో నువ్లుల పెట్టెను, ఆ బక్కవ్యక్తి నువ్వులను పిండి నూనెతీసెను ,అది చూచి భీముడు నువ్వులను ఎంత భలము వుపయోగించి పిండినా నూనెరాలేదు.అప్పడు అతనే సుందరయ్య అని గ్రహించి అతనిని అభినందించెను

Viswasam

ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా
భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో
ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా
నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ
పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు.
ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక
భవంతిని నిర్మించాలి. ఎంత
ఖర్చయినా ఫరవాలేదు. ఆ
భవనం 'నభూతో న భవిష్యతి'
అనే రీతిలో అద్భుతంగా
ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో
మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా,
విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన
నెలనెలా ఇచ్చే
జీతం రాళ్ళు తప్ప. అంచేత
ఈ భవన నిర్మాణానికి కేటాయించిన
చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను'
అనుకున్నాడు. అలా తలచిన
ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే
ముడిసరకులతో నిర్మించి పైకి
మాత్రం కళాత్మకంగా ఉండేలా
వివిధ నగిషీలతో శిల్పాకృతులతో
తీర్చిదిద్దాడు. పైకి
అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ
భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ,
''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా
పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే
దేశం వెళ్లిపోతున్నాను.
అత్యంత విశ్వాసపాత్రుడిగా
ఇన్ని సంవత్సరాలుగా నన్నే
అంటిపెట్టుకొని ఉన్న
నీకు అపురూపమైన జ్ఞాపికలా
మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాన
ు. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి
వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ
పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు
. త్వరలో కూలబోయే ఆ
భవనంలాగే.

Monday, 2 June 2014

నాగమ్మ మ హిమ

అవునా!
నేను మానాన్న ఉదయమే
పండ్లుతోముకుంటూ మా
ఇంటివెనుక నడుస్తూఉంటే
నాకూ త్రోవలో లింగం రకారంలో
పోట్టగొడుగు కనిపిచింది.
దానినిచూసి కామన్ అని వదిలేశాను కాని
కొద్దిదూరంలో నాన్నకు నాగపడిగె
రూపంలో
పుట్టగొడుగు �కనిపించింది,
నాన్న ముందే
పరమశివభక్తుడు ఇంకవదులుతాడా,
దేవుడు దారిమద్యలో
ఉండటం ప్రజలకు క్షేమంకాదు ,
ఒక ఆ రెంటిని ఒక మూల వుంచి
పందిరి వేసి పూజ
చేయడం ప్రారంభించాడు.అది
చూసిన జనం గుంపులుగా
రావడం మొదలుపెట్టారు.పక్కనగల
ఊరిప్త్రజలు రావడం ఆరంభించేరు.
అది చూసిన మా ప్రక్క ఇంటి
మాకులస్తుడు, మా నాన్న ఒక
దేవుని పిచ్చోడు అని హేలన
చేసుకుంటూ చెప్పలు వేసుకోని
బీడీ తాగుతూ ఆ పదేశానికి వచ్చి
చూసి వెళ్ళ బోతుండగా మూర్చ
రావడం మొదలయ్యింది. ఇంటికి
వెళ్ళగానే మూర్చబోయాడు. అదితెలిసి
నాన్న అతనికి పంచాక్షరి చదివి
విభూది పూసిన వెంటే లేచి
కూర్చోవడంచూసి,
జనం ఆచర్యం చెందారు.

Sunday, 1 June 2014

పేజ్

   "ఆనందంగాఉందాం ఆరోగ్యాన్ని కాపాడుకుందామ్ "
పేజ్ లైక్ చెయ్యండి ప్లీజ్  https://m.facebook.com/profile.php?id=543441095772093&refid=7&_ft_=qid.6007211775792743661%3Amf_story_key.-3002534493269676091&__tn__=C

సహయం


నేను ఎవరైనా చిన్న సహయం చేసినా మరువలేను అలాగే కీడుచేసినవారిని మాత్రం సహించలేను ఇదే మొదలు కాబట్టి చాలు మల్లీ వస్తా -;శివం;-