ఒక వ్యాపారి చాలా సంవత్సరాలుగా
భవనాలు, ఇతర
కట్టడాలు నిర్మించే వృత్తిలో
ఉండేవాడు. తనకు సహాయంగా
ఒక వ్యక్తిని పర్యవేక్షకుడిగా
నియమించుకున్నాడు.
దాదాపు పాతిక సంవత్సరాలు ఆ
పర్యవేక్షకుడు ఆ వ్యాపారి
దగ్గర నమ్మకంగా పనిచేశాడు.
ఒకరోజు ఆ వ్యాపారి అతణ్ని పిలిచి
''మనం ఇపుడు ఒక
భవంతిని నిర్మించాలి. ఎంత
ఖర్చయినా ఫరవాలేదు. ఆ
భవనం 'నభూతో న భవిష్యతి'
అనే రీతిలో అద్భుతంగా
ఉండాలి'' అన్నాడు. అలాగేనన్న
పర్యవేక్షకుడు మనసులో
మాత్రం, 'నేను ఇన్ని
సంవత్సరాలు నమ్మకంగా,
విశ్వాసంగా పనిచేశాను.
నాకు ఏం మిగిలింది- ఆయన
నెలనెలా ఇచ్చే
జీతం రాళ్ళు తప్ప. అంచేత
ఈ భవన నిర్మాణానికి కేటాయించిన
చాలా
భాగం డబ్బు సొంతం చేసుకుంటాను'
అనుకున్నాడు. అలా తలచిన
ఆ వ్యక్తి ఆ భవనాన్ని చౌకగా దొరికే
ముడిసరకులతో నిర్మించి పైకి
మాత్రం కళాత్మకంగా ఉండేలా
వివిధ నగిషీలతో శిల్పాకృతులతో
తీర్చిదిద్దాడు. పైకి
అద్భుతంగా
కనిపిస్తూ బలహీనంగా తయారైన ఆ
భవనాన్ని తన యజమానికి
చూపించాడు.
యజమాని ఆనందపడుతూ,
''మిత్రమా ఈ భవంతి మహత్తరంగా
ఉంది. ఇన్నాళ్లు నమ్మకంగా
పనిచేశావు... నేను ఈ
వ్యాపారం వదిలి వేరే
దేశం వెళ్లిపోతున్నాను.
అత్యంత విశ్వాసపాత్రుడిగా
ఇన్ని సంవత్సరాలుగా నన్నే
అంటిపెట్టుకొని ఉన్న
నీకు అపురూపమైన జ్ఞాపికలా
మిగిలిపోయే ఒక అద్భుతమైన
కానుకను ఇవ్వాలనుకున్నాన
ు. ఈ భవంతి నీకోసమే!''
అంటూ భవనాన్ని అప్పగించి
వెళ్ళిపోయాడు. ఆ యజమాని వెళ్ళిన
కొద్దిసేపటికి ఆ
పర్యవేక్షకుడు కుప్పకూలిపోయాడు
. త్వరలో కూలబోయే ఆ
భవనంలాగే.
Wednesday, 4 June 2014
Viswasam
Subscribe to:
Post Comments (Atom)
No comments:
Post a Comment